E.G: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నెల 10న తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి రాజమండ్రిలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారన్నారు. అనంతరం నన్నయ్య యూనివర్సిటీలో జరిగే XVI & XVII సంయుక్త కన్వొకేషన్‌లో పాల్గొంటారన్నారు.