GNTR: అరండల్‌పేటలోని వస్త్ర దుకాణంలో పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన కిషన్ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. ఇది హత్యేనని, యజమాని దానిని ఆత్మహత్యగా చూపిస్తున్నారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మెడపై ఉరి గుర్తులు లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.