NTR: నందిగామలో గ్రామ సంఘాల అభివృద్ధికి స్మార్ట్ అడుగు పడింది. VOAలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం రైతుపేట ఓసీ క్లబ్లో నిర్వహించారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫోన్లను వారికి అందజేశారు. గ్రామీణ సేవలు వేగవంతం, పారదర్శకంగా మారేందుకు సాంకేతికత కీలకమన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో VOAల పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.