అన్నమయ్య: మదనపల్లిలో ఐటీడీఏ ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్ప తెలిపారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. గిరిజన సంఘాల నాయకులతో సమావేశమై ఆధార్ కార్డులు, హాస్టళ్లు, మౌలిక వసతులు, భూముల సమస్యలపై చర్చించారు. గిరిజన అభివృద్ధికి నిధులు, విద్యా సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.