NTR: కంచికచర్ల వసంత కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై అగంతకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. వేకువజామున జరిగిన ఈ ఘటనలో బాధితురాలికి భుజం, ఛాతి, ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.