GNTR: గుంటూరు సీతానగరం-పెదకాకాని రోడ్డులో మణిపురం బ్రిడ్జి వద్ద నిర్మాణ గుంటలో పడి లోకేష్(18) అనే యువకుడు మృతి చెందాడు. భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ప్రమాదమని కుటుంబం ఆరోపిస్తోంది. అయితే, ఇదే రోజు యువకుని పుట్టినరోజు కావడంతో కుటుంబంలో మరింత విషాదం నెలకొంది. వెంటనే దీనికి కారకులైన వారిపై చర్యల తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.