KKD: కోటనందూరు ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు ఎస్సై రామకృష్ణతో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని, సమస్యలు సృష్టిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, భవిష్యత్తులో చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే ఎలాంటి ఉపశమనం ఉండదని హెచ్చరించారు.