BHPL: కాటారం మండలం నస్తూరుపల్లిలో సోమవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఆదివారం BHPL జిల్లా DCC కార్యాలయంలో DCC అధ్యక్షుడు కర్ణాకర్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. నస్తూరుపల్లి సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేశామని పేర్కొన్నారు.