ASF: కౌటాల మండలం కన్నెపల్లి గ్రామంలో ‘నా ఊరు–నా బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గ్రామ యువత స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రహదారి పక్కన పేరుకుపోయిన చెత్తను యువత శ్రమదానం చేసి శుభ్రం చేశారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో అందరూ భాగస్వామ్యం కావాలని యువత ప్రజలకు అవగాహన కల్పిస్తు ఆదర్శంగా నిలుస్తున్నారు.