మంచిర్యాల జిల్లా ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. సీనియర్ ఇంజినీర్ పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా స్నేహ దార్, ప్రధాన కార్యదర్శిగా విక్రమ్, కోశాధికారిగా వినీల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పవన్ను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని జిల్లాలోని సీనియర్ ఇంజినీర్లు అభినందించారు