ADB: ఉట్నూర్ మండలంలోని MLA నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు , ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. మహిళా బిల్లుపైన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యున్నత స్థాయిలో మహిళలను కూర్చోబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.