సత్యసాయి: పెనుకొండలోని ఆల్విన్ కాలనీలో త్రాగునీటి పైపులైన్ సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో త్రాగునీటి పైపులైన్ కనెక్షన్లు తొలగించడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి మంత్రి సవిత రూ.9 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా శనివారం త్రాగునీటి పైపులైన్ పనులను టీడీపీ నాయకులు పరిశీలించారు.