శ్రీకాకుళం అరసవిల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని ఘనంగా ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే గోండు శంకర్రావు చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడుతూ.. వచ్చే ఉగాది నూతన సంవత్సరాది సందర్భంగా పంచాంగాన్ని ఆవిష్కరించడం జరిగిందని పేర్కొన్నారు.