ELR: కోర్టు మానిటరింగ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు నేతృత్వంలో శనివారం జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ ముద్దాయిలకు శిక్షలు పడేలా కోర్టు కానిస్టేబుళ్లు సమర్థంగా పనిచేయాలన్నారు. విచారణలో జాప్యం లేకుండా సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచాలన్నారు.