PLD: నరసరావుపేట మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రమ్య కీర్తన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పట్టణ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించే సేవల మెరుగుదలపై చర్చించారు. నరసరావుపేటలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.