VZM బొబ్బిలి మున్సిపాలిటీలోని 8 లే అవుట్లను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మునిసిపల్ కమీషనర్ రామలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఈ క్రమబద్దికరణపై ఎవరైనా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా తెలపాలని సూచించారు. ఈ మేరకు క్రమబద్దీకరణ లే అవుట్ వివరాలను మున్సిపల్ కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించారు.