సత్యసాయి: కలెక్టరేట్లో గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రతిరోజూ సచివాలయాలను సందర్శించి పాలనను పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి ఉద్యోగి రోజుకు కనీసం 5- 20 సేవలు అందించాలని స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు.