KRNL: గుంతకల్లు–చిప్పగిరి రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు డ్రంక్ డ్రైవ్ తనిఖీలు బుధవారం చేపట్టారు. ఎస్సై సీవీ నరసింహులు ఆధ్వర్యంలో వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతకు భంగం కలిగించే చర్యలపై రాజీ ఉండదని SI వెల్లడించారు.