KRNL: కౌతాళం కామవరం గ్రామంలో చిన్నారి మృతి విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన నరసమ్మ కుమార్తె రక్షిత (6) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం గ్రామ సమీపంలోని ఎల్ఎల్సీ కాలువలో బాలిక మృతదేహం బయటపడింది. కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు.