KRNL: అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని రిమాండ్కు పంపినట్లు కోసిగి ఎక్సైజ్ CI భార్గవ్ రెడ్డి ఇవాళ తెలిపారు. కోసిగి మండలం ఆర్లబండ గ్రామానికి చెందిన హుసేని కందుకూరు నుంచి కడిదొడ్డి క్రాస్ వద్ద అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి నుంచి 6 మద్యం బాక్సులు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.