BHPL: గణపురం(M) మైలారం గ్రామంలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. నాణ్యతతో వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.