రాజమౌళి, మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ ప్రస్తుతం HYD శంకర్పల్లిలో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నారు. దీని తర్వాత చిత్ర బృందం చిన్న బ్రేక్ తీసుకోనుంది. ఈ విరామంలో మహేష్ విదేశాలకు, రాజమౌళి ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లనున్నారట. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయినట్లు సమాచారం.