SDPT: రాయపోల్ మండలం చిన్నమాసాన్పల్లి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తిర్మలాపూర్కు చెందిన యాకటి నర్సిములు మృతి చెందారు. బస్సు దిగుతున్న సమయంలో కాలు జారి కింద పడగా, వెనుక చక్రం తలపై నుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.