అన్నమయ్య: రాయచోటిలో ఇవాళ నాన్వెజ్ ధరలు వెల్లడయ్యాయి. చికెన్ ధరలు స్వల్పంగా తగ్గి కేజీ రూ.230, స్కిన్లెస్ చికెన్ రూ.250గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900గా స్థిరంగా కొనసాగుతోంది వ్యాపారులు తెలిపారు. చేపలలో కొరమేను రూ.450, రాగండి రూ.200, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. చికెన్ ధరలు స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులు కొంత ఊరట పొందుతున్నారని వెల్లడించారు.