KDP: పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో బిజినెస్ రిసోర్స్ సెంటర్ (బీఆర్సీ) మేనేజ్మెంట్ కమిటీ సమీక్షా సమావేశం శనివారం జరిగింది. డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. గ్రామీణ మహిళా సంఘాల వ్యాపారాలను ప్రోత్సహించాలని సభ్యులకు సూచించారు. ఏపీఎంలు, సీసీలు, సీఆర్పీలు సమన్వయంతో పనిచేసి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.