NRPT: మక్తల్ మండలం లింగంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఎంఈఓ ఖాజామురుద్దీన్ హాజరై విద్యార్థుల బోధనా నైపుణ్యాన్ని అభినందించి బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సర్పంచ్, ఎస్ఎంసి చైర్మన్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.