AP: హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించిన ఫలితాల్లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) 40 పోస్టుల్లో 30 మంది మహిళా న్యాయవాదులు ఎంపికయ్యారు. నేరుగా నియామకం ద్వారా సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరులో హైకోర్టు రాతపరీక్ష నిర్వహించింది. అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ మేరకు ప్రాథమికంగా ఎంపికైన 40 మంది పేర్లు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చారు.