MBNR: కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామ అభివృద్ధికి సర్పంచ్ ఆశాదీప్ రెడ్డి చేస్తున్న కృషిని నాగర్కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ప్రశంసించారు. శనివారం తాండ్ర గ్రామంలో రూ.12.50 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వల్ల గ్రామంలో భద్రత పెరుగుతుందని, నేరాల నియంత్రణకు ఇవి దోహదపడతాయని తెలిపారు.