GDWL: వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన హిందూ సమ్మేళనం విజయవంతమైంది. స్థానిక చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి అనంత భారతీ స్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హిందూ ధర్మం, సంస్కృతి, సమైక్యత యొక్క ప్రాముఖ్యతను ఆయన భక్తులకు వివరించారు. ఈ సమ్మేళనానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.