WGL: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను పురస్కరించుకుని వరంగల్ నగరంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. లేబర్ కాలనీ, శంభునిపేట, దేశాయిపేట తదితర ప్రాంతాల నుంచి మహిళలు, చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. డీజే వాయిద్యాల నడుమ ఎంజీఎం సెంటర్ నుంచి హనుమకొండ వరకు సాగిన ఈ ప్రదర్శనలో క్రీస్తు పునరుత్థాన సందేశాలను చాటిచెప్పారు.