TG: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల ఇవాళ జరగనుంది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇందులో బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్రులు ఒకరు గెలుపొందారు. కాగా నిన్న ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పార్టీల నేతల మధ్య గొడవ జరగడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.