ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఉసిరి, జీలకర్ర కలిపిన నీటిని తీసుకోవాలి. ఈ నీరు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి.. అంతర్గత అవయవాలను శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. జీలకర్ర జీర్ణ ఎంజైములను ఉత్తేజపరుస్తుంది.