MLG: మే11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన చేపట్టి సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులకు ఆదేశించారు. జనగణన-2027లో భాగంగా ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. 800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్ నియమాకం చేపట్టాలన్నారు. యాప్లో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీఎస్ఓలు, ఆర్ఐలు సమీక్షలో పాల్గొన్నారు.