WGL: దేశంలో సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహానీయుడు Dr. బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు సాగాలని నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ ఎండీ ఆభిబ్ అన్నారు. జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు.