JGL: బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ ఘన నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ సామాజిక సమానత్వానికి కృషి చేసిన మహానీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.