తన స్నేహితుడు, సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి దర్శకుడు విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘నేను రౌడీనే మూవీ షూటింగ్ కోసం నేను పుదుచ్చేరి వెళ్లాలి. అప్పుడు నా దగ్గర బస్సు టికెట్ కోసం రూ.250 మాత్రమే ఉన్నాయి. డబ్బుల్లేక నేను ఇబ్బంది పడుతుంటే, అనిరుధ్ నా బ్యాగులో రూ.50,000 దాచి సాయం చేశాడు. ఆ రోజు అతను లేకపోతే ఇవాళ దర్శకుడిగా ఉండేవాడిని కాదు’ అని అన్నాడు.