హైదరాబాద్‌లో మరో భారీ బస్ టెర్మినల్ నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా గాజులరామారంలో 100 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నారు. అంతర్రాష్ట్ర, సిటీ, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేక టెర్మినల్స్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో ఎంజీబీఎస్, జేబీఎస్‌పై ఒత్తిడి తగ్గడంతో పాటు నగర ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గనున్నాయి.