TG: హైకోర్టు జోన్ -2లో న్యాయమూర్తుల క్వార్టర్ల నిర్మాణాలకు సీఎం రేవంత్, CJI జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. న్యాయవ్యవస్థకు తాము అత్యున్నత గౌరవం ఇస్తున్నామని రేవంత్ అన్నారు. ఈ భవనం కేవలం నిర్మాణం కాదని.. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబమని తెలిపారు. హైకోర్టు జోన్-1లో పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.