NRPT: ఈ నెల 6న మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలో జరిగే హిందూ సమ్మేళనానికి నిర్వాహకులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో కరపత్రాలు, బ్యానర్లతో ప్రజలను ఆహ్వానిస్తున్నారు. నాయకులు, కౌన్సిలర్లు వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ అనంతరం రామ్ లీలా మైదానంలో సమ్మేళనం జరుగుతుందని తెలిపారు.