SKLM: ఆమదాలవలస మండలం లొద్దలపేట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 6 వ్యక్తులను పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8320 ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆమదాలవలస ఎస్సై కాంతారావు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.