AP: కృష్ణా జిల్లా అటవీశాఖ అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి అవసరమైన ఇసుక, గ్రావెల్ గ్రీన్ ఛానెల్ ద్వారా వెళ్లాలని ఆదేశించారు. మెటీరియల్ సరఫరాలో ఎవరి ఒత్తిళ్లకూ లొంగవద్దని తెలిపారు. ఎవరైనా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని సీఎం సూచించారు.