BDK: బూర్గంపాడు మండలం మోరంపల్లిబంజర్కు చెందిన పొందు రాంబాబు కూలీకి వెళ్లిన సమయంలో అధికారులు వారి ఇంటి ముందే స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీంతో రాకపోకలు కష్టంగా మారాయని, పిల్లలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని బాధితులు శనివారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.