అన్నమయ్య: మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ACB కోర్టు ఊరటనిచ్చింది. ఆయన ఇకపై ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో సంతకం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పాస్ పోర్ట్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ.లక్ష డిపాజిట్ చేయాలంది. ఈ మేరకు బెయిల్ పిటిషన్ ఆంక్షలు సడలిస్తూ న్యాయవాది తీర్పు ఇచ్చారు.