VZM: నెల్లిమర్ల మండలంలోని టెక్కలి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు శనివారం టెక్కలి జనసేన పార్టీ నాయకులు మోయిద జగదీష్ అధ్యక్షతన జనసేన పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే లోకం నాగమాధవి జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా జనసేన వైపు వస్తున్నారని ఆమె అన్నారు.