KRNL: సంక్రాంతి పండుగ వేళ దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గురువారం మంత్రాలయం సీఐ రామాంజులు సూచించారు. ఊరికి వెళ్లేవారు ఇళ్లలో నగదు, బంగారం ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల భద్రత పెరుగుతుందని చెప్పారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా చోరీలను నిరోధించవచ్చని పేర్కొన్నారు.