TPT: మద్యం తాగి వాహనం నడిపినందుకు వ్యక్తికి జైలు శిక్ష విధించినట్లు రేణిగుంట పట్టణ పోలీసులు తెలిపారు. తిరుపతికి చెందిన ముత్తువన్ మద్యం తాగి వాహనం నడుపుతుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడ్డారు. అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. న్యాయమూర్తి 21 రోజుల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారని తెలిపారు.