SS: ఆమడగూరు మండలం జౌకల కొత్తపల్లికి చెందిన మహిళా రైతు గజ్జల శ్రీదేవి చీయా పంట సాగుతో మంచి లాభాలు పొందారు. 1.30 ఎకరాల్లో సాగు చేసి 11 క్వింటాల దిగుబడి సాధించి, క్వింటాకు రూ.14,000 చొప్పున మొత్తం రూ.1,54,000 ఆదాయం పొందారు. రూ.15,000 పెట్టుబడితో రూ.1,39,000 నికర లాభం పొందిన ఆమెను పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అభినందించారు.