సత్యసాయి: ధర్మవరం మండలం గొట్లూరు గ్రామ ప్రజల విజ్ఞప్తికి మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. గ్రామ ప్రధాన రహదారిపై పాఠశాల, ఆలయం ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని బీజేపీ నాయకుడు గొడ్డిటి వెంకటేష్ మంత్రికి విన్నవించారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించి తాజాగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించారు.