KRNL: పీఎం-కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు 22వ విడత ఆర్థిక సాయాన్ని ఈ నెల 13 న విడుదల చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ ఇవాళ తెలిపారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే రెండు విడతల్లో రూ. 4,000 చెల్లించగా, చివరి విడతగా మరో రూ. 2,000 నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని పేర్కొన్నారు.