PLD: మాచర్ల ఏఎస్సై శ్రీనివాసరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రేమ జంటల వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసిన వ్యవహారంపై ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆటో డ్రైవర్ సాయంతో రహస్యంగా వీడియోలు తీసి డబ్బులు వసూలు చేయడంతో పాటు మహిళలను వేధించినట్లు నిర్ధారణ అయింది. ఆయన బెదిరింపుల వీడియోలు వైరల్ కావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.